Addam News
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 12:48 am Posted by : Addam News

ఉల్లాసంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం

ఉల్లాసంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 1, అద్దం న్యూస్ :   ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025-26 క్రీడా పోటీల్లో భాగంగా హైద‌రాబాద్‌ గాంధీనగర్ డివిజన్ మహిళా మ్యూజిక్ చైర్ పోటీలు చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్, గాంధీనగర్ కెనరా బ్యాంక్ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. పోటీల్లో ఉత్తేజాన్ని కల్పించేందుకు మహిళలతో కలిసి కార్పొరేట‌ర్ పావ‌ని పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో మొదటి రోజు సెమీ ఫైనల్‌లో గెలుపొందిన విజేతలను సోమవారం ఫైనల్ పోటీల్లో పాల్గొనేందుకు పెర్లను కార్పొరేటర్ ప్రకటించారు. సెమీ ఫైనల్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, గేమ్స్ ఇన్చార్జి బద్రినారాయణ, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజేపి నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, పి.న‌ర్సింగ్ రావు, మహమూద్, బాలస్వామి, శ్రీనివాస్, ల‌క్ష్మ‌ణ్‌ యాదవ్, చిర్ర యాదగిరి, విజయ లక్ష్మి, మంగమ్మ, సంయుక్త రాణి, పూర్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png