Addam News
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 2:28 pm Posted by : Addam News

గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన ప్ర‌ఫుల్ రాంరెడ్డి

గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన ప్ర‌ఫుల్ రాంరెడ్డి

హైదరాబాద్, జ‌న‌వ‌రి 30, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్య‌మ‌కారుల ( టియు ) జేఏసి నాయ‌కుడు గడ్డం రాజేష్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం గాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి త్యాగ‌రాయ గాన స‌భ వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్య‌మ‌కారుల ( టియు ) జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి హాజ‌రై గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… దేశ ప్రజల హృదయాల్లో మహాత్మా గాంధీ గుర్తులు సజీవంగా నిలబడి ఉంటాయన్నారు. దేశ స్వాతంత్య్ర‌ ఉద్యమం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరం మరువకూడదని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో భవాని శ్రీనివాస్, జి.సిద్ధార్థ, ఎన్‌.సుధీర్, శ్రీనివాస్, బిక్షపతి గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png