ఫైబర్ డైట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఇప్పటి కాలంలో బరువు నియంత్రణ కేవలం అందానికి కాదు, ఆరోగ్యానికి కూడా అవసరమైంది. దీని కోసం ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. పీచు పదార్థం జీర్ణక్రియను సమతుల్యం చేస్తూ, మలబద్ధకం తగ్గిస్తుంది, కొవ్వు నిల్వలను తగ్గించి శరీరానికి తేలికగా అనిపించేటట్లు చేస్తుంది. ఫైబర్ రెండు రకాలుగా ఉంటుంది – ద్రవీభవించే (soluble) ఫైబర్, ద్రవీభవించని (insoluble) ఫైబర్. ద్రవీభవించే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ద్రవీభవించని ఫైబర్ పేగుల కదలికను మెరుగుపరుస్తూ,...