అలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మం పై స‌న్నాహ‌క స‌మావేశం

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :    అలయ్‌–బ‌లయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా ద‌స‌రా స‌మ‌యంలో నిర్వ‌హించే అలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది కూడా ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం అలయ్‌–బ‌లయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లో అలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మం పై స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హాజ‌ర‌య్యారు. రాబోయే అలయ్‌–బ‌లయ్-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే విషయంపై కమిటీ...