Addam News
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 10:27 pm Posted by : Addam News

ఎస్‌టిపిలను ప్రారంభానికి సిద్ధం చేయండి – అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్‌రెడ్డి

                   అంబర్‌పేట్‌, అత్తాపూర్ ఎస్‌టిపిలను సంద‌ర్శిస్తున్న జ‌ల‌మండ‌లి ఎండి అశోక్‌రెడ్డి

హైద‌రాబాద్‌, మే 29, అద్దం న్యూస్ :   ఎస్‌టిపిల పనుల్లో వేగం పెంచి తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎండి.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్ మిట్టల్‌తో కలిసి అంబర్‌పేట్‌, అత్తాపూర్ ఎస్‌టిపిలను సందర్శించారు. తొలుత అంబర్‌పేట్‌ ఎస్‌టిపికి వెళ్లిన ఆయన.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చిన్న చిన్న సివిల్ వర్క్‌లు, గార్డెనింగ్, పెయింటింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణం లాంటి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎస్‌టిపిని ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అలాగే సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టి ఎస్‌టిపి ప్రాంగ‌ణంలో చెత్తా చెదారం తొల‌గించి నేల‌ని చ‌దును చేయాల‌ని సూచించారు. అనంతరం అత్తాపూర్ ఎస్‌టిపిని సైతం సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఎండీ మిగిలిపోయిన పనుల్ని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం సుజాత, ఎస్‌టిపి ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png