Addam News
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 10:51 am Posted by : Addam News

గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్..! (Video)

గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్..! (Video)

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రీల్‌ను పంచుకున్నాడు. తన ప్రియురాలు ఆకృతి అగర్వాల్‌తో ఉన్న ఈ రీల్‌లో రొమాన్స్ చేసిన పృథ్వీ షా.. ఆమెను కలవడం దేవుడి ప్లాన్ అని పేర్కొన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 6 మ్యాచ్ అనంతరం దొరికిన విశ్రాంతిని పృథ్వీ షా తన గర్ల్ ఫ్రెండ్‌తో ఆస్వాదిస్తున్నాడు. ఆమెతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన పృథ్వీ షా.. బీచ్ ఒడ్డున ఆకృతితో రోమాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి రీల్ పంచుకున్నాడు.

ముంబైకి చెందిన ఆకృతి అగర్వాల్ పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. త్రిముఖ చిత్రంలో కూడా ఆమె నటించింది. ఆకృతి అగర్వాల్‌కు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. పృథ్వీ షా, ఆకృతి గతంలో చాలా సార్లు కలిసి కనిపించారు. జులైలో పృథ్వీ షా షేర్ చేసిన ఓ ఫొటో కింద ఆకృతి కామెంట్ చేయడంతో ఈ ఇద్దరి ప్రేమాయణం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జోడీ డేటింగ్ చేస్తోంది.

అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేశాయి. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు నుంచి తప్పుకున్న పృథ్వీ షా మహారాష్ట్ర తరఫున తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించడంతో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షల అతని కనీస ధరకు కొనుగోలు చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో పృథ్వీ షా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 6 మ్యాచ్‌ల్లో 32.16 సగటుతో 193 పరుగులే చేశాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png