యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
» బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా
హైదరాబాద్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా అన్నారు. 1000 రోజులుగా నెరవేరని విద్యార్థుల హామీలను ప్రశ్నిస్తూ, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ ఆశోక్‌నగర్‌లో విద్యార్థులతో కలిసి జైసింహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నెరవేరని కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ ఆశోక్‌నగర్‌లో ‘ ప్రామిస్ ఫెయిల్యూర్ ఫోటో బూత్ ’ ఏర్పాటు చేసి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జైసింహ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వెయ్యి రోజుల పాలన పూర్తవుతున్నా ఆ హామీ నెరవేరలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీల పంపిణీ వంటి హామీలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.

విద్యార్థులు, యువతకు సంబంధించిన రూ.15 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, కొండా శ్రీధర్‌రెడ్డి, రోషం బాలు, మురా నరేష్, కరికె కిరణ్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్రీకాంత్, అరుణ్‌కుమార్, బండ జుగేందర్, గోక నవీన్, గంటల రాజు, కల్వగోపి, జమాలుద్దీన్, మాధవి, ఎర్రం శ్రీనివాస్‌గుప్తా, జీవై.గిరి, ఎయిర్టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply