Addam News
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 1:05 pm Posted by : Addam News

కోతుల బెడద నుంచి కాలనీ వాసులను రక్షించండి 

కోతుల బెడద నుంచి కాలనీ వాసులను రక్షించండి 
– డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు విద్యానగర్ కాలనీవాసుల విజ్ఞప్తి

హైద‌రాబాద్‌, జూలై 14, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్, అచ్యుత రెడ్డి మార్గ్ తదితర ప్రాంతాల్లో గత కొంత కాలం నుంచి కోతులు స్థానిక ప్రజలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని విద్యానగర్ కాలనీవాసులు జిహెచ్ఎంసి ముషీరాబాద్ సర్కిల్–41 డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో స్థానిక విద్యానగర్ కాలనీవాసులు ఎం.నర్సయ్య, మహమ్మద్ ఖదీర్, జైపాల్ రెడ్డి, రోషం బాలు, జి.వెంకటరమణ, మహేందర్ లు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ… కాలనీలో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వాచ్ మెన్లు డ్యూటీ చేయలేకపోతున్నారని, పనిమనుషులు, పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీనికి స్పందించిన డిప్యూటీ కమిషనర్ వెంటనే వెటర్నరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారని నర్సయ్య తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png