కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి
హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరనసలు తెలియచేయాలని ఏఐయుకెఎస్ జాతీయ నాయకుడు రంగయ్య అన్నారు. హైదరాబాదులోని మార్క్స్ భవన్‌లో రాష్ట్ర ఆఫీస్ బీరర్స్ సమావేశం జరిగింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రైతాంగంపట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వినాశనకరంగా ఉన్నాయని సమావేశం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఏఐయుకెఎస్ జాతీయ నాయకుడు రంగయ్య మాట్లాడుతూ... రైతులు సుదీర్ఘంగా చేసిన ఫలితంగా ఉపసంహరించిన నల్లచట్టాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టే ఎత్తుగడలో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా బిల్లును తెచ్చారన్నారు. తీరా...