మ‌లిద‌శ ఉద్య‌మకారుడు దివంగ‌త లింగాల కేదారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించండి – అధికారుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ( CMRF ) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ...