Addam News
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 11:25 am Posted by : Addam News

పెన్షన్ కెవైసి అప్‌డేట్‌ కొరకు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు కనీస సౌకర్యాలు కల్పించండి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

పెన్షన్ కెవైసి అప్‌డేట్‌ కొరకు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు కనీస సౌకర్యాలు కల్పించండి
– బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, మే 25, ( అద్దం న్యూస్‌ ) :   పాత పెన్షన్ కెవైసి అప్‌డేట్‌ కొరకు వ‌చ్చిన ల‌బ్దిదారుల‌కు క‌నీస సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌ని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్ సింగ్‌ను కోరారు. పాత పెన్షన్ల లబ్దిదారులకు కెవైసి అప్‌డేట్‌ చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ముషీరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయానికి భారీగా లబ్ధిదారులు తరలివచ్చారు. వృద్ధులు తమకు కనీస సౌకర్యాలు కల్పించండం లేదని, మండుటెండలో నిరసించి పోతున్నామని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావనికి ల‌బ్దిదారులు తమ సమస్యను చెప్పుకున్నారు.

మాజీ కార్పొరేటర్ పావని వారి సూచనల మేరకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్ మండల కార్యాలయానికి చేరుకొని అక్కడి ప్రజలతో మాట్లాడారు. మండుటెండలో వేచివున్న ప్రజలకు మంచినీరు లాంటి కనీస వసతులు కల్పించడంలో ఎందుకు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని ఎంఆర్ఓ పై విన‌య్ కుమార్ నిల‌దీశారు. రేపటి నుండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముషీరాబాద్ మండల కార్యాలయం పరిధిలోని అన్ని ఏరియాల్లో, ప్రభుత్వ కమ్యూనిటీహాళ్ల‌ల్లో కెవైసి అప్‌డేట్‌ ప్రక్రియ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధీనగర్ డివిజన్‌లోని పెన్షనర్లకు జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని వినయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png