Addam News
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 1:41 pm Posted by : Addam News

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళి అర్పించిన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు ట్యాంక్‌బండ్ వ‌ద్ద ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అడ్వ‌కేట్ జెఎసి క‌న్వీన‌ర్‌, తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అంబేద్కర్ బాల్యం నుంచి కుల వివక్షను, అవమానాలను ఎదుర్కొన్న ఫలితంగా ఆయనలో కుల వ్యవస్థ పట్ల వ్యతిరేక భావాలు జీవం పోసుకున్నాయన్నారు. భారత సమాజానికి మాయనిమచ్చలా ఉన్న కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. బొంబాయి శాసనమండలి సభ్యుడిగా నియమితుల్కెన తరువాత దళితుల హక్కుల కోసం పోరాడారని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా వారికి హక్కులు కల్పించడం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చూపిన చొరవ అసామాన్యం. స్వతంత్ర భారతంలో తొలి న్యాయశాఖ మంత్రిగా ప‌నిచేశార‌ని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png