అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన పులిగారి గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్, తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ బాల్యం నుంచి కుల వివక్షను, అవమానాలను ఎదుర్కొన్న ఫలితంగా ఆయనలో కుల వ్యవస్థ పట్ల వ్యతిరేక భావాలు జీవం పోసుకున్నాయన్నారు. భారత సమాజానికి మాయనిమచ్చలా ఉన్న కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. బొంబాయి...