నిరుద్యోగుల అరెస్టులతో రాహుల్ గాంధీ పర్యటన సిగ్గుచేటు – కయ్య వెంకటేష్

చిక్క‌డ‌ప‌ల్లి, ( అద్దం న్యూస్ ) : నిరుద్యోగుల శాంతియుత ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వకుండా, అధికార పార్టీలకు పోలీసు బందోబ‌స్తుతో కూడిన ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి ఇవ్వడం బాధాకరమ‌ని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి నాయ‌కుడు క‌య్య వెంక‌టేష్ అన్నారు. రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మూడేళ్లు గడుస్తున్న కనీసం 20వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణలో పర్యటిస్తున్న సంద‌ర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగ యువతను...