ఆల్మ‌ట్టి డ్యామ్ ఎత్తును పెంచితే తెలుగు రాష్ట్రాల‌కు తీవ్ర న‌ష్టం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఏకపక్షంగా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పూర్తి స్థాయిలో అన్యాయమని, ఇది రైతుల జీవనాధారానికి పెను ప్రమాదమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ఇప్పటికే కృష్ణా నది జలాల వివాదం కొనసాగుతున్న తరుణంలో,...