రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి – ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) జిల్లా కార్యదర్శి ఎండి.జావీద్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం జావీద్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత 16 లక్షల 25 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు....