రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి – తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ
హైదరాబాద్, నవంబర్ 20, అద్దం న్యూస్ : రాజీవ్ యువ వికాస్ పథకానికి నిధులను కేటాయించి సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ డిమాండ్ చేశారు. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాజీవ్ యువ వికాస్ పథకం పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గురువారం జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్...