ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రాజ్యసభ ఎంపి మందాడి అనిల్ కుమార్ యాదవ్
న్యూయార్క్, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ( UNGA ) రెండవ కమిటీ ' స్థూల ఆర్థిక విధాన ప్రశ్నలు, అభివృద్ధికి ఆర్థిక సహాయం ' అనే అంశంపై జరిగిన సంయుక్త చర్చలో భారతదేశం తరపున రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటనను సమర్పించారు. ఈ అంతర్జాతీయ సభను ఉద్దేశించి ఎంపి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడి, ఆహార భద్రతను పరిరక్షించే...