ప్రేమ, ఆప్యాయతలను పెంచే పండుగ ” రక్షాబంధన్ “

ప్రేమ, ఆప్యాయతలను పెంచే పండుగ   ” రక్షాబంధన్ “

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 28, ( అద్దం న్యూస్ ) :   అన్నా చెల్లెళ్లు, అక్కా త‌మ్ముళ్ల‌ మధ్య ఆప్యాయతను ప్రేమను మరింత పెంచే పండుగ రక్షాబంధన్ పండుగని ఈ పండుగ కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి దోహ‌దపడుతుందని శాసనమండలి సభ్యుడు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎం.కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య ఆధ్వర్యంలో నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో శుక్ర‌వారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ… పండుగలు మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడే విధంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్మిక సోదరీమణులు తెలంగాణ జన సమితి మహిళా కార్యకర్తలు పారిశుధ్య కార్మికులు ఈ సందర్భంగా కోదండరాంకు రాఖీలను కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రేమతో చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, కార్యాలయ ఇన్చార్జి హనుమంతరెడ్డి, జిహెచ్ఎంసి ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప, వినయ్, నగర ఉపాధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కోశాధికారి సురేష్, సనత్‌న‌గ‌ర్ ఇన్చార్జ్ రమేష్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ హనుమంత్ గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్ సయ్యద్ ఇస్మాయిల్, జన సమితి నాయకులు సదానంద్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, అంజి, వెంకటేష్, విద్యార్థి జన సమితి నగర అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page