దోమ‌ల‌గూడ‌ పోలీస్‌స్టేష‌న్‌లో ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు

దోమ‌ల‌గూడ‌  పోలీస్‌స్టేష‌న్‌లో ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు దోమ‌ల‌గూడ‌, ఆగ‌స్టు 28, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్‌లో శుక్ర‌వారం ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ అంజ‌ద్ అలీకి పోలీస్ మ‌హిళా సిబ్బంది రాఖీలు క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్పెక్ట‌ర్ అంజ‌ద్ అలీ మాట్లాడుతూ... శాఖలోని సిబ్బంది అందరూ ఒకే కుటుంబంగా భావించి పండుగను ఆనందంగా జరుపుకోవడం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీస్‌స్టేష‌న్ సిబ్బంది పాల్గొన్నారు.