Addam News
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 11:15 am Posted by : Addam News

అమితాబ్‌కు కూడా అలానే జరిగింది: Rakul Preet Singh

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో విజయాపజయాలు, ఒడుదొడుకులు సహజమని, తమ కుటుంబానికి కూడా అలాంటి అనుభవమే ఎదురైందని అగ్ర నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) అన్నారు. తన భర్త, నిర్మాత జాకీ భగ్నానీ (Jackie Bhagnani) దివాలా తీశారంటూ ఇటీవల ప్రచారమైన వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. ఈ వార్తలను ఆమె ఖండించారు.

జాకీ భగ్నానీ నిర్మించిన ‘బడే మియా.. ఛోటే మియా’ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన ఆర్థికంగా నష్టపోయారంటూ, తన నిర్మాణ సంస్థను మూసివేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై రకుల్‌ (Rakul Preet Singh) మాట్లాడుతూ, “క్లిక్స్ కోసం ఏమైనా రాసే సంస్కృతి పెరిగింది. వాస్తవానికి, ప్రచారంలో ఉన్న వార్తలకు చాలా వ్యత్యాసం ఉంది. నా భర్త ఏ సవాళ్లు ఎదుర్కొన్నాడో నేను దగ్గర నుంచి చూశాను. కేవలం మూడు సినిమాలు ఆదరణ పొందలేకపోయాయనేది నిజమే. దీంతో మేము ఆర్థికంగా కొంత నష్టపోయాము కూడా. కానీ, కంపెనీని మూసివేయలేదు” అని స్పష్టం చేశారు.

పరిశ్రమలో ఇలాంటివి మామూలేనని రకుల్‌ (Rakul Preet Singh) అభిప్రాయపడ్డారు. “ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఒకానొక దశలో అమితాబ్‌ బచ్చన్ గారికి కూడా ఇదే జరిగింది. ఎదుగుతున్నప్పుడు ఇదంతా ఒక భాగం” అని ఆమె పేర్కొన్నారు. అసలు నిజం సమయం వచ్చేవరకూ ప్రజలకు తెలియదని, అందుకే కొన్ని విషయాల గురించి మౌనంగా ఉండటమే మంచిదని రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh) వ్యాఖ్యానించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png