అమితాబ్‌కు కూడా అలానే జరిగింది: Rakul Preet Singh
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో విజయాపజయాలు, ఒడుదొడుకులు సహజమని, తమ కుటుంబానికి కూడా అలాంటి అనుభవమే ఎదురైందని అగ్ర నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అన్నారు. తన భర్త, నిర్మాత జాకీ భగ్నానీ (Jackie Bhagnani) దివాలా తీశారంటూ ఇటీవల ప్రచారమైన వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. జాకీ భగ్నానీ నిర్మించిన 'బడే మియా.. ఛోటే మియా' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన ఆర్థికంగా నష్టపోయారంటూ, తన నిర్మాణ సంస్థను మూసివేశారంటూ...