Addam News
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:55 am Posted by : Addam News

ముస్లీం మ‌హిళ‌ల‌కు రంజాన్ తోఫా

ముస్లీం మ‌హిళ‌ల‌కు రంజాన్ తోఫా

హైదరాబాద్, మార్చి 12, అద్దం న్యూస్ :   రంజాన్ పండుగ‌ను పురస్క‌రించుకుని ప్ర‌భుత్వం అంద‌చేస్తున్న రంజాన్ తోఫా అంద‌చేసే కార్య‌క్ర‌మం గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే గోపాల్‌, మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ లు హాజ‌రై ముస్లీం మ‌హిళ‌ల‌కు రంజాన్ తోఫాల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజెపి డివిజ‌న్ ఉపాధ్యక్షుడు డి.కుమార్, ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఛైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు శీలం స‌త్య‌నారాయ‌ణ‌, బంటారం యాద‌గిరి గౌడ్‌, శంక‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పున్న స‌త్య‌నారాయ‌ణ‌, సబర్మతినగర్ బస్తీ వాసులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png