Addam News
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 12:28 pm Posted by : Addam News

58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :  58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధ‌వారం హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ అధ్య‌క్ష‌త‌న‌ మ‌హిళా ఉద్యోగస్తులకు, విద్యార్థినుల‌కు ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిరాగాంధీ జ‌యంతి, గ్రంథాల‌య మాజీ ఛైర్మ‌న్ కోదాటి నారాయ‌ణ రావు వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారి చిత్ర ప‌టాల‌కు పూల‌మాల‌లేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… మ‌హిళ‌లంద‌రూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఆమె సేవలను భారతదేశపు మహిళా శక్తిని నిరూపించారని అన్నారు. విద్యార్థులు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గ్రంథాలయ ప్రధమ శ్రేణి గంధపాలకురాలు చంద్రకళ, సుబ్బలక్ష్మి, ప్రతిభారెడ్డి, సీతామాలక్ష్మి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఉద్యోగస్తులు వెంకటేష్ యాదవ్, అవినాష్, రామ్మోహన్, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బొల్లం మహేందర్, జంగారెడ్డి, పిడి మహేష్, శ్రీకాంత్, రామాంజ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వరి, అమరావతి, భాగ్యలక్ష్మి, అశోక్, సునీత, గ్రంథాలయ అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png