Addam News
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 1:16 pm Posted by : Addam News

25 ఏండ్లుగా స్నేహితులుగా నిలిచిన పేరొందిన డాక్టర్లు

25 ఏండ్లుగా స్నేహితులుగా నిలిచిన పేరొందిన డాక్టర్లు

కాచిగూడ, ఆగ‌స్టు 3, ( అద్దం న్యూస్ ) :  స్నేహమంటే చదువే ముఖ్యం కాదు, ఐక్యంగా సమాజ సేవ చేయాలనే సందేశాన్ని ఈ డాక్టర్లు ఆచరణలో చూపిస్తున్నారు. వివారాల్లోకి వెలితే.. యూపిహెచ్‌సి ఆర్‌హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూటిసి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.మనోజ్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రాయ‌ల్‌, కార్డియాలజిస్ట్ డాక్టర్ హితేశ్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ లలిత్ అగర్వాల్, ఎండో క్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి, యూఎస్‌లో హిమాటో ఆంకాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ రెడ్డి ఈ ఆరుగురు డాక్టర్లు 25 ఏండ్లుగా ప్రాణ స్నేహితులుగా ఏర్పాడ్డారు. గత 25 ఏండ్లుగా డాక్టర్ వృత్తిలో వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తూ, ప్రజలకు వైద్య సేవలు సేవలందిస్తూ, ఇప్పటికి తమ స్నేహన్ని కొనసాగిస్తున్నారు. దివ్యాంగులు, పేద వృద్ధులు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ స్నేహితుల రోజు సందర్భంగా ఈ ఆరుగురు డాక్టర్లు ఒక చోట కలుసుకుని వారి అభిప్రాయాలను వెలుబుచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png