Addam News
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 12:45 am Posted by : Addam News

HCU : ఉదంతంపై స్పందించిన రేణు దేశాయ్

HCU : ఉదంతంపై స్పందించిన రేణు దేశాయ్

రేవంత్ రెడ్డి గారు.. ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆక్సిజన్ కావాలి

హైదరాబాద్ వెబ్ డెస్క్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములను ప్ర‌భుత్వ స్వాధీనం అంశం పై సినీ న‌టి రేణుదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించారు. ఒక త‌ల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్‌రెడ్డి గారు.. నా 45 ఏళ్ల వ‌య‌స్సు దాటాను..ఎలాగూ రేపో మాపో పోతాను.. మా పిల్ల‌ల కోసం.. అంద‌రి పిల్ల‌ల భ‌విష్య‌త్ త‌రాలకు ఆక్సిజ‌న్ కావాలి.. వారికి నీరు కావాల‌న్నారు. అభివృద్ధి అనేది త‌ప్ప‌నిస‌రి అని.. మ‌న‌కు ఐటి పార్కులు కావాలి… కానీ ఈ ఒక్క 400 ఎక‌రాల‌ను వ‌దిలేసి అవ‌కాశం ఉంటే ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవ‌ల‌ప్‌మెంట్ చేయాల‌ని ఆమె కోరారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేల ఎక‌రాల భూమి ఉంద‌ని.. ఆ విష‌యం నాకంటే అనుభ‌జ్ఞులైన మీకే తెలుసున‌న్నారు. హెచ్‌సియు భూముల విష‌యంలో మ‌రో సారి పున‌రాలోచించాల‌ని ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png