షెడ్యూల్ కంటే 6 గంటల ముందుగానే గండిపేట కాండ్యూట్ మరమ్మతు పనులు పూర్తి
105 ఏళ్ల పురాతన కాండ్యూట్లో భారీ లీకేజీలకు అడ్డుకట్ట # 8 కీలక ప్రాంతాల్లో 90 శాతానికి పైగా లీకేజీల నియంత్రణ # ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు # ప్రభావిత ప్రాంతాలకు దశలవారీగా తాగునీటి సరఫరా పునరుద్ధరణ గండిపేట, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరానికి ఉస్మాన్‌సాగర్ ( గండిపేట ) జలాశయం నుంచి ముడినీటిని సరఫరా చేసే ప్రధాన కాండ్యూట్లో భారీ లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన మరమ్మతు పనులను జలమండలి...