Addam News
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 12:18 am Posted by : Addam News

సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన శ్రీ కృష్ణ స‌ద‌ర్ స‌మ్మేళ‌నం ఉత్స‌వ క‌మిటీ ప్ర‌తినిధులు – స‌ద‌ర్ ఉత్స‌వాల‌కు రావాల‌ని ఆహ్వానం

హైద‌రాబాద్‌, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) :

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో శ్రీ కృష్ణ స‌ద‌ర్ స‌మ్మేళ‌నం ఉత్స‌వ క‌మిటీ ప్ర‌తినిధులు బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఆధ్వ‌ర్యంలో నవంబ‌ర్ 4వ తేదీన న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జ‌రుగ‌నున్న స‌ద‌ర్ ఉత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని సీఎంను ప్ర‌తినిధులు ఆహ్వానించారు. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎంకు స‌ద‌ర్ స‌మ్మేళ‌నం ఉత్సవ క‌మిటీ ప్ర‌తినిధులు ధన్యవాదాలు తెలియ‌చేశారు. సీఎంను క‌లిసిన వారిలో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ త‌దిత‌రులున్నారు.