సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు – సదర్ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం
హైదరాబాద్, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీన నగరంలోని ఎన్టిఆర్ స్టేడియంలో జరుగనున్న సదర్ ఉత్సవాలకు హాజరుకావాలని సీఎంను ప్రతినిధులు ఆహ్వానించారు. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎంకు సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియచేశారు. సీఎంను కలిసిన వారిలో...