Addam News
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 3:53 pm Posted by : Addam News

హ‌రిన‌గ‌ర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుక‌లు

హ‌రిన‌గ‌ర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుక‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లో ద‌క్షిణ్ భార‌త్ సేవా స‌మాజ్ వ‌ద్ద 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా బిజెవైఎం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో దక్షిణ్ భారత్ సేవా సమాజ్ కమిటీ అధ్యక్షుడు భీమనపల్లి రమేష్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెండ్యాల రవి, ఉపాధ్యక్షుడు ప‌రుశురామ్‌, రెడ్డి, రాము, బ‌స్తీ పెద్ద‌లు గ‌డ్డం బాల‌కృష్ణ‌, నేరెళ్ల బాల‌య్య‌, నేరెళ్ల కుషాల్‌, తుడుం రాజు, గండు శివ‌, శ్రీనివాస్‌, రాజు, వివేకానంద‌, విజ‌య్, వేణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png