దివ్యాంగుల స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌కు విన‌తి

  దివ్యాంగుల స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌కు విన‌తి   హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :   దివ్యాంగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విక‌లాంగుల సంఘం నాయ‌కులు బండ జ‌గ‌న్ కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. విక‌లాంగులు అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని విక‌లాంగుల సంఘం నాయ‌కులు బండ జ‌గ‌న్ అన్నారు. విక‌లాంగుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన వారిలో విక‌లాంగుల సంఘం నాయ‌కులు బ‌క్క సుధాక‌ర్‌, శ్రీనివాస్‌, సాయి, మౌనిక త‌దిత‌రులున్నారు.