Addam News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:20 am Posted by : Addam News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలి – 80 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగ సంఘాల డిమాండ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలి
– క్రిమిలేయర్‌ను తొలగించాలి
– జనాభా లెక్కలలో కులగణన చేయడాన్ని స్వాగతిస్తాం
– OBC కాలం పెట్టి ప్రతి కులానికి కోడ్ ఇవ్వాలి
» 80 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగ సంఘాల డిమాండ్

కాచిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) :   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలని 80 ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్ లో కేంద్ర ప్రభుత్వ- ప్రభుత్వ రంగాలకు చెందిన 80 బిసి ఉద్యోగుల సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 80 బిసి ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షునిగా దాన కర్ణ చారిని ఎన్నుకున్నారు. ఈ సరనూవేశానికి సంఘ అధ్యక్షుడు దాన కర్ణ దారి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, శాసన మండలి పక్ష నేత మధుసూదన చారి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… విద్యా, ఉద్యోగ నియామకాలలో బిసి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్‌ నిబంధన విధించిన తీరు బీసీల పై విషక, చిన్న చూపు చూస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుందన్నారు. కొనసాగుతున్న ఆరు రిజర్వేషన్ల వర్గాలు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎన్‌సిసి, మహిళ రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ ఒక బిసిలకే ఎందుకు విధించారని ప్ర‌శ్నించారు. రిజర్వేషన్ల లక్ష్యం ఆర్థికాభివృద్ధి కాదు పేదరిక నిర్మూలన పథకం కాదు పాలన లో బిసిలకు భాగస్వామ్యం కల్పించడం ఒకటైతే, రిజర్వేషన్ల ద్వారా చదువు, ఉద్యోగం తద్వార అధికారంలో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి సామజిక హోదా పెంచడం ఇంకొక భాగమ‌న్నారు.

అర్ధం పర్ధం లేని క్రిమిలేయర్‌ బిసిలకే ఎందుకు కల్పించారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇంత చిన్న విషయంలో కూడా బిసిలకు అన్యాయం చేశారని విమర్శించారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన, న్యాయపరమైన అవరోధాలు. అడ్డంకులు ఏమీ లేవన్నారు. రాజ్యాంగ బద్దమైన మండల్ కమీషన్ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిపార్చు చేసింద‌ని, చట్టబద్దమైన పార్లమెంటరి కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందన్నారు. ఇక ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం బిసి ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బిసిల‌కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పిందని.. అన్ని వైపుల నుంచి బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సులున్నాయన్నారు. ప్రమోషన్లలలో రిజర్వేషన్లు పెట్టడానికి ఎలాంటి అవరోదాలు లేవన్నారు. మండల్ కమిషన్ సిపార్పుల ప్రకారం కేంద్రంలో బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 34 సంవత్సరాలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బిసిల శాతం 17 శాతం దాటలేదన్నారు.

శానన‌మండ‌లి ప‌క్ష నేత మ‌ధుసూద‌న చారి మాట్లాడుతూ… బీసిలలో భావధ్యనం భానిస ఆలోచన విధానం పోవాలన్నారు. 77 సంవత్సరాల తరువాత రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించకపోతే ఇదేమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. బీసీ కోటా క్రింద ఉద్యోగాలు వచ్చాయని.. ఈ కులాల నుంచి వచ్చినందున ఈ కులాల అభివృద్ధి కోసం పోరాడే సాంఘిక బాధ్యత భుజాన వేసుకోవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 80 బిసి ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు దాన కర్ణ చారి మాట్లాడుతూ… బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని.. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపట్ట బోయే కులగణనలో ఓబిసి కాలం పెట్టి ప్రతి కులానికి కోడ్ నెంబర్ ఇవ్వాలన్నారు.

పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 27 నుండి 56 శాతానికి పెంచాలని కోరారు. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల‌ని, బిసిల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు. ఈ స‌మావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌, 80 బిసి ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ముదిరాజ్, కోశాధికారి రామరాజు యాదవ్, చైర్మన్ యు.చిన్నయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, సంయుక్త కార్యదర్శులు భాగ్యలక్ష్మి, శిరీష పున్న, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు నాగ మోహన్, కెవి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png