ముషీరాబాద్ డివిజ‌న్‌లో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి – బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహా

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్‌లో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహా కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న చిల‌క‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ కార్యాల‌యంలో డిజిఎం మోహ‌న్‌రాజ్‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ డివిజ‌న్‌లో పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల పై చ‌ర్చించారు. డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ముఠా జైసింహా మాట్లాడుతూ... ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొర‌వ‌తో అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. అభివృద్ధి కోసం అధికారులు...