పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాలను ప‌రిష్క‌రించండి -ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

ఢిల్లీ, ( అద్దం న్యూస్ ) :      తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాల‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారాన్ని వేగంగా అందజేస్తున్నామని ప్రధానమంత్రికి వివరించారు. ఆదివారం నరేంద్ర మోదీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ...