Addam News
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 9:22 pm Posted by : Addam News

డివిజన్‌లో నెల‌కొన్న‌ విద్యుత్ సమస్యలను ప‌రిష్క‌రించండి – విద్యుత్ డివిజ‌న‌ల్ ఇంజ‌నీర్‌కు కార్పొరేట‌ర్ పావ‌ని విన‌తి

హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ :   గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని బ‌స్తీల్లో నెల‌కొన్న విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం సైఫాబాద్‌లోని విద్యుత్ శాఖ డివిజ‌న‌ల్ ఇంజ‌నీర్ నెహ్రూ నాయ‌క్‌ను గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగ‌ల‌పై వాలిన చెట్ల కొమ్మ‌లు, ఫీడ‌ర్ల వ‌ద్ద ప్ర‌మాద‌క‌రంగా పెరిగిన చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించే ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న కొన‌సాగుతున్నాయ‌ని, ఈ మేర‌కు చాలా ఫిర్యాదులు అందుతున్నాయ‌ని కార్పొరేట‌ర్ పావ‌ని తెలిపారు. అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో బంచ్ కేబుల్‌ను ఏర్పాటు చేయాల‌ని, హైటెన్ష‌న్ విద్యుత్ తీగ‌ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, అవ‌స‌రం ఉన్న చోట విద్యుత్ స్థంభాల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారిని కార్పొరేట‌ర్ పావ‌ని కోరారు. ఇందుకు డివిజనల్ ఇంజనీర్ నెహ్రూ నాయ‌క్ సానుకూలంగా స్పందించారు. కార్పొరేటర్ పావ‌ని సూచనల మేరకు పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ నాయకులు ఎం.ఉమేష్, శివ కుమార్, ఆనంద్ రావు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png