డివిజన్‌లో నెల‌కొన్న‌ విద్యుత్ సమస్యలను ప‌రిష్క‌రించండి – విద్యుత్ డివిజ‌న‌ల్ ఇంజ‌నీర్‌కు కార్పొరేట‌ర్ పావ‌ని విన‌తి

హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ :   గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని బ‌స్తీల్లో నెల‌కొన్న విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం సైఫాబాద్‌లోని విద్యుత్ శాఖ డివిజ‌న‌ల్ ఇంజ‌నీర్ నెహ్రూ నాయ‌క్‌ను గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగ‌ల‌పై వాలిన చెట్ల కొమ్మ‌లు, ఫీడ‌ర్ల వ‌ద్ద ప్ర‌మాద‌క‌రంగా పెరిగిన చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించే ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న కొన‌సాగుతున్నాయ‌ని, ఈ మేర‌కు చాలా ఫిర్యాదులు...