Addam News
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 12:06 am Posted by : Addam News

ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత – శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, డాక్ట‌ర్‌.కాచం స‌త్య‌నారాయ‌ణ గుప్త‌

ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత

– శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 

  బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది

– వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్త

నాగోల్‌, సెప్టెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :   ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి అన్నారు. ఆదివారం మనుసురాబాద్ డివిజన్‌లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధుసూదనాచారి హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్తతో క‌లిసి మధుసూదనాచారి ఉపాధ్యాయులకు మెమొంటోలు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ… క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి నేటి పోటీ ప్రపంచంలో రాణించే విధంగా విద్యా బోధన చేయడం ఉపాధ్యాయుల ప్రథమ కర్తవ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ… బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక బాధ్యత కూడ నేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక సభ్యులు నంగునూరి రమేష్, కొత్త రవి, కాచం సాయి, వంగవీటి శ్రీనివాస్, కోడుమూరి దయాకర్, సతీష్, మురళి తదితరులు పాల్గొన్నారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png