కెసిఆర్ పథకాలను రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర
– ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఆగస్టు 17, ( అద్దం న్యూస్ ) : కెసిఆర్ చేపట్టిన పథకాలన్నింటిని రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ లు అన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల రద్దు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం ముషీరాబాద్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి డౌన్… డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ లు మాట్లాడుతూ… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పేద అమ్మాయిల వివాహాల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. కెసిఆర్ మళ్లి అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్, కల్వగోపి, కొండ శ్రీధర్‌రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆకుల అరుణ్, సయ్యద్ అహ్మదుల్లా భక్తియారీ, మహ్మద్ అలీ, కొండా సహదేవ్, పోతుల శ్రీకాంత్, కరికె కిరణ్, కృపానంద్, బిక్షపతి యాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్, ముదిగొండ మురళీ, చిట్టి శ్యామ్ సుందర్, ముచ్చకుర్తి పద్మ, మాధవి, స్రవంతి, ఎయిర్‌టెల్ రాజు, అబ్రార్ హుస్సేన్ ఆజాద్, మునావర్ చాంద్, జావీద్ ఖాన్, రాజేష్, బల్వంత్, సత్యనారాయణ బాబు, టిల్లు, బొట్టు శ్రీనివాస్, చింటు ప్రభాస్, మేడి సత్యనారాయణ, నితిన్, కార్తీక్ యాదవ్, బల్లెకరి రాములు, బల్లెకరి రమేష్, రఫియుద్దీన్, రాజు యాదవ్, మణి, కనక మహాలక్ష్మీ, ఆర్.శ్రీనివాస్, యు.శ్రీధర్, మేరి, మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply