Addam News
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 1:28 pm Posted by : Addam News

కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలి

కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలి

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 5, అద్దం న్యూస్ :   మిర్యాలగూడ బహిరంగ సభలో మాజీ సీఎం కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంట‌నే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు హ‌రీష్ కుమార్ అన్నారు. కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ ద‌హ‌నం కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన కెసిఆర్ పై రేవంత్‌రెడ్డికి వ్యాఖ్య‌లు చేసే అర్హ‌త లేద‌న్నారు. ఏమి చేత‌కాని దావోస్ దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ పై వ్యాఖ్య‌లు చేసిన రేవంత్‌రెడ్డి వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు అస్లం, వికాస్‌, న‌గేష్‌, ట‌క్క‌ర్ శ్రీను, పురుషోత్తం, యోగేష్‌, అన్వేష్‌, శ్రీకాంత్‌, షాబాజ్‌, ఖ‌దీర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png