Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్..
తెలంగాణ బ్యూరో, అక్టోబర్ 1, ( అద్దం న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లిస్తారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్...