ఆటో డ్రైవర్ల ఆత్మ హత్యలు మరచి పర్మిట్ల దందాకు తెరలేపిన రేవంత్ సర్కార్ – తెలంగాణ స్టేట్ ఆటో డ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి
హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ : ఆటో డ్రైవర్ల ఆత్మ హత్యలు మరచి పర్మిట్ల దందాకు తెరలేపిన రేవంత్ సర్కార్.. తన విధానాలు మార్చుకోవాలని ఆటో డ్రైవర్ల జేఏసి డిమాండ్ చేసింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్‌లో తెలంగాణ స్టేట్ ఆటో డ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిపిటిఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, టిఎడియు నాయకుడు కొమరయ్య, టిఆర్ఎకెటియు నాయకుడు ఈశ్వర్, బిఎంఎస్ నాయకులు హబీబ్, టిఎస్ఎడియు నాయకుడు...