Addam News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:05 am Posted by : Addam News

కల్యాణలక్ష్మి పథకంపై కక్ష‌ పెట్టుకున్న‌రేవంత్‌ సర్కార్‌ – బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా

హైద‌రాబాద్‌, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    కల్యాణలక్ష్మి పథకంపై రేవంత్‌ సర్కార్ క‌క్ష‌పెట్టుకుంద‌ని బిఆర్ఎస్ పార్టీ న‌గ‌ర‌ యువ నాయ‌కుడు ముఠా జైసింహా అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో శుక్ర‌వారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా హాజ‌రై కెసిఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా జైసింహా మాట్లాడుతూ… పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసా ఇవ్వాలనే సదాశయంతో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం అంకురార్పణ చేసిన పథకం ‘ కల్యాణలక్ష్మి ’. 2014 అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకం ప్రారంభమైందన్నారు.

ఉద్యమకాలంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా ములుగు మండలం ( నేటి ములుగు జిల్లా కేంద్రం ) లో ఒక గిరిజన కుటుంబం తమ బిడ్డ పెండ్లి కోసం పడిన కష్టాన్ని కేసీఆర్‌ కండ్లారా చూశారన్నారు. ఆ గిరిజన తండ్రి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కల్యాణలక్ష్మి అని అన్నారు. ఈ మానవీయ పథకం పురుడు పోసు కొని శుక్రవారానికి పుష్కరం పూర్తవుతున్నదన్నారు. ఇప్పటి వరకు సుమారు 13 లక్షల మంది కుటుంబాల్లో కల్యాణకాంతులు నింపిందన్నారు. కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి ద్వారా దాదాపు 12.71 లక్షల కుటుంబాలకు భరోసా ఇచ్చార‌న్నారు. అలాంటి మాన‌వీయ ప‌థ‌కానికి రేవంత్ రెడ్డి తూట్లు పొడిచార‌ని విమ‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు కొండ శ్రీధ‌ర్ రెడ్డి, పోతుల శ్రీకాంత్‌, ముత్యం బాల్‌రాజ్ గౌడ్‌, ముదిగొండ ముర‌ళీ, చింటు, స్ర‌వంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.