రిసాల ఖుర్షీద్ జాహీలో బ‌స్తీ ద‌వాఖానా, క‌మ్యూనిటీహాల్‌, అంగ‌న్‌వాడిల‌ను నిర్మించాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ విన‌తి

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :   రాంన‌గ‌ర్ డివిజ‌న్‌ రిసాలా ఖుర్షీద్ జాహీలో బ‌స్తీ ద‌వాఖానాను ఏర్పాటు చేయాల‌ని, క‌మ్యూనిటీహాల్ నిర్మించాల‌ని, ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేయాల‌ని, అంగ‌న్‌వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ ఎజాజ్ హుస్సేన్ కోరారు. ఈ మేర‌కు బుధ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను క‌లిసి ఎజాజ్ హుస్సేన్ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు స‌య్య‌ద్...