కాచిగూడ, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు హిందూ సంస్కృతి, సంప్రాదాయాలకు నిదర్శనమని అర్చకులు శాస్త్రుల నాగరాజు శర్మ అన్నారు. హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాకలోని శ్రీ సాయి రెసిడెన్సీలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ హారతులతో మహిళలు విడ్కొలు పలికారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో రాంబాబు దంపతులు రూ.33 వేల రూపాయలకు దక్కించుకున్నారు. అదే విధంగా భోగ స్వామి దంపతులు రూ.17 వేల రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం ఆర్చకులు శాస్త్రుల నాగరాజుశర్మ మాట్లాడుతూ… కుల, మతాలకు అతీతంగా ప్రజలు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భోగ వెంకటయ్య, భోగ స్వామి, పాక స్వామి, లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి, ప్రేమ్ కుమార్, శైలేశ్, పి.రమేశ్, పవన్, శ్రీనివాస్, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.