తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జనగామ, జూన్ 19, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు నిర్వర్తించిన పాత్ర కీలకమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం సరైంది కాదని అన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జనగామలోని గాయత్రి గార్డెన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ద్వితీయ...