Addam News
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 6:24 pm Posted by : Addam News

ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ సంక‌ల్ప్ అభియాన్ జిల్లా కో–క‌న్వీన‌ర్‌గా రొయ్యూరు శేష‌సాయి

హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ :   ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ సంక‌ల్ప్ అభియాన్ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కో–క‌న్వీన‌ర్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రొయ్యూరు శేష‌సాయి నియ‌మితుల‌య్యారు. శేషసాయి ఇప్ప‌టికే బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యునిగా కొన‌సాగుతున్నారు. ఈ సంద‌ర్భంగా శేష‌సాయి మాట్లాడుతూ… త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ సంక‌ల్ప్ అభియాన్ జిల్లా కో–క‌న్వీన‌ర్‌గా నియ‌మించిన అభియాన్ రాష్ట్ర క‌న్వీన‌ర్ పి.విక్ర‌మ్ రెడ్డికి, బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్ గౌడ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప యోజన కార్యక్రమాన్ని వివిధ వర్గాల సమూహాలు, కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, బూత్ స్థాయి వరకు తీసుకుపోతామన్నారు. వికసిత భారత్ లక్ష్యంతో 2047 సంపన్న భారత్ సమృద్ధి భారత్ సాధించే లక్ష్యంతో ఉద్యమంగా ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ పని చేస్తుందని చెప్పారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png