Addam News
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 5:59 am Posted by : Addam News

 అరుణాచల యాత్రను ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్

 అరుణాచల యాత్రను ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 16, అద్దం న్యూస్ : 

ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలో భాగంగా అరుణాచల యాత్రను డిపో మేనేజర్ సురేందర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎవరైనా ముందుకు వచ్చి తమ జీవితంలో విశేషమైన రోజున యాత్ర దానం ( ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తే ) చేస్తే ఆర్టీసీ యాత్ర చేపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా పేదరికంతో కీలక పుణ్యక్షేత్రాలు చూడని వారి యాత్రకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఎవరైనా యాత్ర దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఆధ్మాతిక యాత్రలో భాగంగా విన్టేజ్ విన్నింగ్ టీమ్ హైద‌రాబాద్ స‌భ్యులు జంగయ్య, లాలూ ప్రసాద్, సూరోజు న‌ర‌సింహా చారి, పంబ శ్రీప‌తి త‌దిత‌రుల‌ ఆధ్వర్యంలో టీమ్ అరుణాచల విహార యాత్ర కోసం బ‌స్‌తో బ‌యలుదేరి వెళ్లారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png