RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో 198 సూపర్‌వైజర్ పోస్టులు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి (RTC Jobs) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) పోస్టులు ఉన్నాయి. అర్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి...