టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు, ఎన్‌టిఆర్ అభిమాని ఆగ‌య్య మృతి బాధాక‌రం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, దివంగ‌త ఎన్‌టిఆర్ అభిమాని కల్యాణపు ఆగయ్య మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌లగూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఆగ‌య్య మృతి ప‌ట్ల సంతాపాన్ని తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి కరుడుగట్టిన వీర అభిమానిగా పేరు గాంచిన కల్యాణపు ఆగయ్య గుండెపోటుతో మరణించారన్నారు. ఆయన...