సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భువిపైకి..
ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన సునీతా విలియమ్స్ వైద్య పరీక్షల కోసం తరలింపు యావత్ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ క్రూ కాప్సూల్ ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీతా, బుచ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వొచ్చారు. తొలుత సునీతా, బుచ్‌ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్ నుంచి బయటకు...